Xiaomi Redmi Note 4 : ఇంటర్నెట్ డేటా వాడకం పర్యవేక్షణ ఎలా
గత కొన్ని సంవత్సరాల నుంచి సెల్ ఫోన్ లో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. కాని ఇంటర్నెట్ అందించే ‘డేటా ప్లాన్లు ‘ మాత్రం ఇప్పటి దాకా కాస్టలీ గానే ఉన్నాయి. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఇంటర్నెట్ వాడకం మానిటర్ చేసే ఫెసిలిటీ ఉంది. ఎప్పుడైతే మన ప్లాన్ లో కేటాయించిన డేటా క్రాస్ అవ్వబోతుందో, ఆండ్రాయిడ్ ఇంటర్నీట్ని ఆఫ్ చెయ్యకలదు. ఈ గైడ్ లో ఇంటర్నెట్ డేటా పరిమితిని ఎలా సెటప్ చెయ్యాలో చూపిస్తాం. ఇంకా చాలా గైడ్ లు తయారు చేసాం. పూర్తి జాబితా చూడాలంటె ఈ పేజీ కి వెళ్ళండి.
సెట్టింగ్స్ లో “SIM cards and mobile networks” ఓపెన్ చెయ్యండి.
‘సెట్ డేటా ప్లాన్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఆ సెట్టింగ్ ఓపెన్ చెయ్యండి.
మీకు కనిపించే లిస్ట్ అఫ్ ‘మొబైల్ డేటా లిమిట్’ పైన క్లిక్ చెయ్యండి.
ముందుగా ‘పీక్ డేటా లిమిట్’ సెట్ చెయ్యాలి. రిలయన్స్ జిఓ అయితే నెలకి 30GB ఉంటుంది ఈ లిమిట్ (౩౧ మార్చ్ వరకు). అదే ఎయిర్టెల్ వోడాఫోన్ లాంటివి అయితే చాలా ప్లాన్లు ఉన్నాయ్. మీ ప్లాన్ లో డేటా ఎంత ఉందొ అదే ‘పీక్ డేటా లిమిట్’. ఎప్పుడైతే ఈ లిమిట్ క్రాస్ అవుతుందో, మీ ఇంటర్నెట్ వాడినప్పుడు ఎక్స్ట్రా మనీ కట్ అవుతుందు.
డేటా యూసెజి వార్నింగ్ మీ డేటా లిమిట్ కి 75% నుంచి 85% మధ్యలో సెట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే డేటా లిమిట్ కి దగ్గరవుతుంటే ఒక హెచ్చరిక వస్తే మంచిది.
Reliance Jio లాంటి కొన్ని నెట్వర్క్స్ కి రోజుకి 1GB మాత్రమే వాడతాకిని వీలు ఉంది. ఎప్పుడైతే ౧గ్బ దాటుతుందో, ఇంటర్నెట్ వేగం 128కేబీపీస్ కి పడిపోతుంది. ఇలాంటి నెట్వర్క్స్ కి ‘డైలీ డేటా లిమిట్ ‘ సెట్టింగ్ ని వాడండి. జిఓ అయితే 1024MB సెట్ చెయ్యండి. ఎప్పుడైతే ఈ లిమిట్ రీచ్ అవుతుందో, మీకు హెచ్చరిక వస్తుంది (ఇంటర్నెట్ ఆఫ్ ఆప్షన్ కూడా ఉంది). ఒక్కో సారి మనం నెలమధ్యలో అదనపు డేటా కొనుగోలు చేస్తుంటాం. అలాంటప్పుడు ‘అడిషనల్య్ పర్చెస్డ్ డేటా’ సెట్టింగ్ లో ఎంత అదనపు డేటా కొనుగోలు చేసారో ఎంటర్ చెయ్యండి.